• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ముషార్రఫ్‌తో మాట్లాడుతా: బుష్‌ హామీ

By Staff
|

వాషింగ్టన్‌: జమ్మూ కాశ్మీర్‌లోకి జరుగుతున్న చొరబాట్లను అదుపు చేసేందుకు చర్యలు తీసుకోవాలని తాను పాకిస్థాన్‌ అధ్యక్షుడుపర్వేజ్‌ ముషార్రఫ్‌కు సూచిస్తానని అమెరికా హామీ భారత్‌కు ఇచ్చింది.

తాము పాకిస్థాన్‌ అధికారులతోనూ, పర్వేజ్‌ ముషార్రఫ్‌తోనూ సంబంధాలు నిర్వహిస్తూ చొరబాట్లను అదుపు చేసేలా చూస్తామని వైట్‌హౌస్‌ అధికార ప్రతినిధి ఆరీఫ్లెశ్చర్‌ చెప్పారు. అద్వానీ అమెరికా పర్యటన ముగింపు సందర్భంగా ఆయన బుధవారం ఈవిషయం చెప్పారు. భారత ఉపఖండంలో చొరబాట్ల వ్యవహారం విదేశాంగ విధానంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయనిఆయన అన్నారు. తాము మిత్రదేశంగా పాకిస్థాన్‌కు ఆయుధాలుఅందిస్తూనే ఉంటామని, సహాయకారిగా వీటిని అందిస్తామని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

భారత ప్రధాని వాజ్‌పేయి శాంతి చర్చల కోసం తీసుకున్న చర్యలు ఫలవంతం కావడానికి అనుకూల వాతావరణం కల్పించేందుకు తాను పాకిస్థాన్‌ అధ్యక్షుడుపర్వేజ్‌ ముషార్రఫ్‌తో మాట్లాడుతానని అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్ల్యు. బుష్‌ భారత ఉపప్రధాని ఎల్‌.కె. అద్వానీకి హామీ ఇచ్చారు. తన అమెరికా పర్యటన ముగింపు సందర్భంగా అద్వానీవిలేకరుల సమావేశంలో బుధవారం ఈ విషయం చెప్పారు. వాజ్‌పేయి చొరవ చూపి విభేదాలను పరిష్కరించుకోవడానికి రాజకీయపరమైన వెసులుబాటు కల్పించారని బుష్‌ అన్నారు.

సీమాంతర ఉగ్రవాదానికి సంబంధించి భారత్‌ విషయానికి వస్తే ఈ సమస్య భారత్‌దేనని, భారత్‌ సొంతంగానే ఈ సమస్యను పరిష్కరించుకోగలదని అద్వానీ అన్నారు. అమెరికాతో చర్చలు పాకిస్థాన్‌ కేంద్రంగా సాగలేదని, అమెరికా, భారత్‌ల మధ్య సంబంధాలు మెరుగుపరుచుకునే విస్తృత ప్రాతిపదికపై ఈ చర్చలు జరిగాయని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X