• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కమల్‌ చిత్రానికి సెక్యురిటీ నో: జయ

By Staff
|

చెన్నై: ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ రూపొందిస్తోన్నవివాదస్పద చిత్రం శాండియార్‌ (తెలుగులో దొమ్మి) షూటింగ్‌ ప్రదేశంలో పోలీసు భద్రతా కల్పించేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నిరాకరించారు. శుక్రవారం చెన్నైలో ఆమెవిలేకరులతో మాట్లాడుతూ..ఎందరో చిత్రాలు ప్రశాంతంగా రూపొందిస్తుండగా కావాలనివివాదాన్ని రేకేత్తించే చిత్రాలు తీయడం ఎందుకు అని ప్రశ్నించారు.

ఈ చిత్రం షూటింగ్‌ జూన్‌ 9న మధురై సమీపంలోని తెని ప్రాంతంలో ప్రారంభం కావాల్సి ఉండగా, స్థానిక దళిత నేతల ఆందోళనతో సినిమా ప్రారంభం కాకుండా ఆగిపోయింది. దీంతో కమల్‌ హాసన్‌ తన చిత్రం షూటింగ్‌ జరిగే ప్రాంతం వద్ద పోలీసు బందోబస్త్‌ కావాలని స్థానిక పోలీసులను కోరగా వారు నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రి జయలలితను కలుసుకొని భద్రతా కల్పించవల్సిందిగా అభ్యర్థించారు.

అందుకు ఆమె నిరాకరిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు.పోలీసులు సమాజం మొత్తానికి భద్రతా కల్పిస్తారు. ఒక వ్యక్తికి సుదీర్ఘకాలంపాటు భద్రత కల్పించడంఅసమంజమైన పని. పోలీసు సిబ్బంది కొరతతో పాటు, శాంతిభద్రతలవిషయంలో పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతారు. నేను కల్పించుకోనని ఆమెవివరణ ఇచ్చారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ నిలిచిపోయింది. అలాగే, తాజా రాజకీయ పరిణామాల గురించి మాట్లాడుతూ..కాంగ్రెస్‌ తో అన్నాడిఎంకే మొగ్గుచూపుతోందని వచ్చిన వార్తలను ఆమె తోసిపుచ్చారు. సోనియాగాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేసినంత కాలం తాము కాంగ్రెస్‌ తో చేతులు కలిపే ప్రసక్తే లేదని ఆమె స్పష్టంచేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X