• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గాంధీభవన్‌లో యువజనులబాహాబాహీ

By Staff
|

హైదరాబాద్‌: ఎఐసిసి కార్యదర్శి, కాంగ్రెస్‌ ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌ రాక సందర్భంగా గాంధీభవన్‌లో యువజన కార్యకర్తలుబాహాబాహీకి దిగారు. గులాం నబీ ఆజాద్‌ శుక్రవారం ఉదయం ఇక్కడికి వచ్చారు.

యువజ కాంగ్రెస్‌ రాష్ట్రాధ్యక్షుడు వెంకట్రావు అనుకూల, వ్యతిరేకవర్గాలు పిసిసి కార్యాలయం గాంధీభవన్‌ ఆవరణ ఘర్షణకు దిగడంతో అట్టుడికిపోయింది. అవినీతిపరుడు, అసమర్థుడూఅయిన వెంకట్రావును యువజన కాంగ్రెస్‌ పదవి నుంచి తప్పించాలని కోరుతూ ఒక వర్గం ఆజాద్‌కు వినతిపత్రం సమర్పించింది. ఈ వర్గంవిమర్శను ఖండిస్తూ వెంకట్రావు అనుకూలవర్గం ఆజాద్‌ ముందు వాదించింది. వెంకట్రావు అవినీతిపరుడూ, అసమర్థడూ అని ఆయన వ్యతిరేక వర్గంవిమర్శించింది.

యువజన కాంగ్రెస్‌తో ఏ మాత్రం సంబంధంలేని వెంకట్రావును అధ్యక్షుడిగ నియమించడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని ఈ వర్గం వాదిస్తోంది. డబ్బుల కోసం వెంకట్రావు కార్యకర్తలను వేధిస్తున్నారని వారు ఆరోపించారు. వెంకట్రావును తొలగించి, సమర్థుడైన నాయకుడిని ఆ పదవిలో నియమించాలని ఈ వర్గం డిమాండ్‌ చేస్తోంది. పదవులు రానివారు కావాలని వెంకట్రావుపై అసత్య ప్రచారానికి దిగుతున్నారని ఆయన అనుకూలవర్గంఅంటోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X