ఆదివారం వై.ఎస్.యాత్రకు ముగింపు
హైదరాబాద్: రెండు నెలల క్రితంకాంగ్రెస్ శాసనసభాపక్ష నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి చేపట్టిన ప్రజాప్రస్థానంఆదివారంతో ముగియనుంది. ఏప్రిల్ 9న రంగారెడ్డిజిల్లాల్లో వై.ఎస్. తన యాత్రను ప్రారంభించారు. మధ్యలో అస్వస్థత కారణంగా స్వల్ప విరామం మినహా ఆయన నిరవధికంగా సాగిస్తోన్న యాత్ర ఆదివారం ఇచ్ఛాపురంలో ముగుస్తుంది. శనివారం సాయంత్రానికి ఆయన మొత్తం 1450 కిలో మీటర్ల దూరం నడిచారు.
శనివారంఉదయం శ్రీకాకుళం జిల్లా అంబుగం వద్ద ప్రారంభించినవై.ఎస్. ఇచ్చాఫురంకు కొద్ది కిలోమీటర్ల దూరంలో యాత్రనుముగించారు. ఆదివారం ఇచ్చాఫురంలో జరిగే బహిరంగసభలోఆయన ప్రసంగిస్తారు. దీంతో ఆయన సుదీర్ఘ ప్రస్థానంముగుస్తుంది. అనంతరం ఆయన విశాఖ పట్నం చేరుకొని అక్కడినుంచి తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వరుడి దర్శనం చేసుకొని తిరిగిహైదరాబాద్ కు చేరుకుంటారు. ఇటీవలకాలంలో అతిపెద్ద రాజకీయ ఈవెంట్ గా పేరు తెచ్చుకొన్న ఈ యాత్రముగింపు రోజు కాంగ్రెస్ తన ఎన్నికల భేరినిమోగించే అవకాశం ఉందని తెలుస్తోంది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!