వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వాజ్పేయే మా సారథి: అద్వానీ
లండన్: 2004 ఎన్నికల తర్వాత కూడా తమ సారథి ప్రధాని అటల్బిహారీ వాజ్పేయినే అని ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీ అన్నారు. ఎల్.కె. అద్వానీకి లండన్లో ఇండియన్ హై కమీషనర్ రోనెన్సేన్ స్వాగత ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా అద్వానీ మాట్లాడారు.
1988, 1998 మధ్యకాలంలోని 11 ఏళ్లలో ఏడుగురు ప్రధానులు వచ్చారని, 1998 నుంచి 2003 వరకుఒకరే ప్రధానిగా వున్నారని అన్నారు. 2004 ఎన్నికల తర్వాత తిరిగి వాజ్పేయి ప్రధాని అవుతారని, సుపరిపాలన, ద్రవ్యోల్బణం అదుపు, ఆర్థిక స్థిరత్వం వంటి కారణాల వల్ల తిరిగి వచ్చే ఎన్నికల్లో బిజెపి గెలుస్తుందని ఆయన అన్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!