• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చెరువుల పునరుద్ధరణ: బాబు

By Staff
|

హైదరాబాద్‌: వచ్చే మూడేళ్లలో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాల్లో 30 శాతం పచ్చదనం సాధించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. గ్రీన్‌ హైదరాబాద్‌ వర్క్‌షాప్‌ ప్రారంభ సభలో ఆయన సోమవారం ప్రసంగించారు.

జంటనగరాల్లోని చెరువులనే కాకుండా రాష్ట్రంలోని చెరువులన్నింటినీ పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ పునరుద్ధరణకు సంబంధించి అంతర్జాతీయ నిపుణుల అభిప్రాయాలు కూడా తీసుకుంటామని ఆయన అన్నారు. చెరువుల పునరుద్ధరణకు కేంద్ర నిధులను కోరుతామని ఆయన చెప్పారు. నీటి పంపిణీ కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి బాధ్యత అని, అది ప్రస్తుతం రాష్ట్ర బాధ్యతగానే ఉన్నదని ఆయన చెప్పారు. రాష్ట్రంలో నీటిపారుదల వసతులను పెంచడానికి ఇచ్చంపల్లి, పోలవరం ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా చేపట్టాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్నికోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X