• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కోటి వరాలపై చర్చకు అసెంబ్లీ: వైయస్‌

By Staff
|

తిరుపతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించిన కోటి వరాల అమలు తీరుపై చర్చించేందుకు వెంటనే శాసనసభా సమావేశాలు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ(సిఎల్‌పి) నేత డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో 68 రోజుల పాదయాత్రను పూర్తి చేసిన ఆయన మంగళవారం తిరుపతి చేరుకున్నారు.

తిరుపతిలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. ఆయన రాక సందర్భంగా తిరుపతిలో ర్యాలీ జరిగింది. కోటి వరాల అమలుకు నిధులు ఎలా సమకూరుస్తారో చెప్పాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉన్నదని, ఈవిషయాన్ని చర్చించేందుకు శాసనసభను సమావేశపరచాలని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో పథకాలను ప్రకటించి, ఎన్నికలు ముగిసిన తర్వాత వాటిని రద్దు చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు అలవాటేనని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనేవిషయం తన పాదయాత్ర సందర్భంగా వెల్లడైందని ఆయన అన్నారు. కోటివరాలను చంద్రబాబు తెలుగుదేశం మహానాడులో ప్రకటించారని, వాటిని మంత్రివర్గం చేత ఆమోదింపజేశారని, ఇవన్నీసరే వాటి అమలుకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారో తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు. ఈ వరాల అమలుకుబడ్జెట్‌ కేటాయింపులు కూడా లేవని ఆయన అన్నారు.

తిరుపతి చేరుకున్న రాజశేఖర్‌ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి వెస్ట్‌ చర్చికి వెళ్లారు. అనంతరం ఆయన కాలినడకన తిరుమలకు బయలుదేరి వెళ్లారు. తన పాదయాత్ర సందర్భంగా తన దృష్టికి వచ్చిన సమస్యలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ఒక లేఖాస్త్రం సంధించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X