• search

బిజెపి, ఎన్‌డిఎ స్థాయిలు పెరిగాయి: పిఎం

By Staff
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    ముంబాయి: వచ్చే రాష్ట్ర శాసనసభల ఎన్నికల్లో, లోక్‌సభ ఎన్నికల్లోవిజయం సాధించాలనే ఏకైక లక్ష్యంతో పని చేయాలని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి భారతీయ జనతా పార్టీ (బిజెపి) కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వాతావరణం బిజెపికి, దాని మిత్రపక్షాలకు అనుకూలంగా ఉన్నదని ఆయన అన్నారు.

    కార్యకర్తల సైనికులు ప్రజల్లోకి వెళ్లి మనం సాధించిన గతవిజయాలను, భవిష్యత్తు దర్శనాన్ని వివరించాలని ఆయన అన్నారు. ముంబాయికి 50 కిలోమీటర్ల దూరంలోని థానే జిల్లా ఉత్తన్‌లో ఏర్పాటయిన పార్టీ మేధోమథనం సదస్సును ఆయన బుధవారంనాడు ప్రారంభించారు. విభిన్న దిశల్లో కార్యకర్తలు గత ఐదేళ్లుగా చేసిన కృషి వల్ల తమ పార్టీపై ప్రజలు మంచి అభిప్రాయంతో ఉన్నారని ఆయన అన్నారు. స్థిర ప్రభుత్వాన్నిఅందించడంలో తాము విజయం సాధించామని ఆయన అన్నారు.

    సీమాంతర ఉగ్రవాదాన్ని సమర్థంగా ఎదుర్కుంటున్నామని, బిజెపి, జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) స్థాయి జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లోపెరిగిందని ఆయన చెప్పారు. తాము అన్ని వర్గాలను పట్టించుకుంటామని, అన్ని వర్గాలతో తమతో తీసుకొని పోతామని ఆయన అన్నారు.

    తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more