• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హైదరాబాద్‌లో వైయస్‌కు ఘనస్వాగతం

By Staff
|

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ(సిఎల్‌పి) నేత డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డికి హైదరాబాద్‌లో గురువారం ఉదయం ఘనస్వాగతం లభించింది. తన 68 రోజుల పాదయాత్ర అనంతరం ఆయన బుధవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆయన చైన్నై వెళ్లారు.

చెన్నై నుంచి ఆయన గురువారంనాడు హైదరాబాద్‌కు వచ్చారు. ఆయనకు హైదరాబాద్‌లోని బేగంపేటవిమానాశ్రయంలో కార్యకర్తలు పెద్ద యెత్తునస్వాగతం పలికారు. ఆయన అక్కడి నుంచి ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పిసిసి) కార్యాలయం గాంధీభవన్‌ చేరుకున్నారు. అక్కడ డప్పుల మోతతో, నృత్యాలతో ఆయనస్వాగతం పలికారు. మహిళలు తిలకం దిద్దారు. మంగళహారతులు పట్టారు. పిసిసి అధ్యక్షుడుఎం. సత్యనారాయణ రావు రాజశేఖర్‌ రెడ్డిని సాదరంగా ఆహ్వానించారు. ఆయనను బిగ్గరగా కౌగలించుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X