• search

ఇరాక్‌కు బలగాలపై ప్రధాని నిర్ణయం

By Staff
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    ఐఎఎఫ్‌ ప్రత్యేక విమానం నుంచి: ఇరాక్‌కు భారత బలగాలను పంపేవిషయమై ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి చైనా పర్యటన అనంతరమే నిర్ణయం జరుగుతుందని ఉప ప్రధాని ఎల్‌.కె. అద్వానీ అన్నారు. వాజ్‌పేయి ఆదివారం చైనా పర్యటనకు బయలుదేరుతున్నారు.

    ఈ విషయంలో రెండు అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్నదని, దీని గురించి ఇరాక్‌ ప్రజలు ఏమనుకుంటారనేది ఒకటి కాగా ఇరాక్‌లో ఇరాకీ పాలనాయంత్రాంగాన్ని పునరుద్ధరించే ప్రణాళిక ఏమిటనేది రెండోదని ఆయన అన్నారు.విమానంలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు.

    ప్రధాని వాజ్‌పేయి చైనా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇరాక్‌కు భారత బలగాలను పంపేవిషయమై నిర్ణయం తీసుకోవచ్చునని ఆయన అన్నారు. ఆ ప్రాంతంలో భారత ప్రయోజనాలపై ఆధారపడి ఈవిషయంలో నిర్ణయం జరుగుతుందని ఆయన చెప్పారు. అవి ఇరాక్‌ ప్రయోజనాలు కూడాఅయి ఉంటాయని ఆయన అన్నారు. ఐక్యరాజ్య సమితిలోశాశ్వత సభ్యత్వం పొందే విషయంతో దీనికి ఏ మాత్రం సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.

    తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more