వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జన్మభూమి, పుష్కరాలపై మంత్రివర్గం చర్చ
హైదరాబాద్: వచ్చే జన్మభూమిపై, గోదావరి పుష్కరాలపై చర్చకు సోమవారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో వచ్చే జన్మభూమి అమలు కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి కసరత్తు చేస్తుంది.ఉద్యోగ నియామకాలపై విడుదలైన 610 జీవో అమలు తీరుపై కూడా మంత్రివర్గం చర్చించనుంది. ప్రభుత్వోద్యోగులకు డిఎ మంజూరుపై కూడా సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. కోటి వరాల అమలుపై కూడా మంత్రి వర్గం చర్చిస్తుంది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!