• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నక్సల్స్‌ నిరోధక గ్రామాలకు 10లక్షలు

By Staff
|

హైదరాబాద్‌: నక్సలైట్లను ఎదిరించి, వారికి ఎదురుతిరిగే గ్రామాలకు ప్రోత్సాహకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. నక్సలైట్లను గ్రామాల్లోకి రాకుండా అడ్డుకునే గ్రామాలకు పది లక్షల రూపాయల నగదును ప్రకటించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే శారదాంబను రక్షించిన గ్రామస్థులను ఆయన అభినందించారు. ఆ గ్రామ మహిళలతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఆ గ్రామానికి పదిలక్షల ప్రోత్సాహకాన్ని ప్రకటించారు.

రాష్ట్రంలోని ఇతర అన్ని గ్రామాలకు ఇదే తరహా ప్రోత్సాహకాలనుఅందిస్తామని, ఈ డబ్బును నగదు రూపేణా గానీ, ఇతర అభివృద్ధి కార్యక్రమాల ద్వారా గానీఅందచేస్తామన్నారు. ఆ డబ్బును ఎలా ఉపయోగించుకోవాలన్న నిర్ణయాన్ని ఆయా గ్రామాలకే వదిలేస్తామన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలుఅందచేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

ఒకప్పుడు నక్సల్స్‌ కు గ్రామస్థులేస్వయంగా ఆశ్రయం ఇచ్చేవారని, ఇప్పుడు వారి ఆగడాలను ప్రజలు తిప్పికొట్టడం ప్రభుత్వం చేపట్టిన జన్మభూమి కార్యక్రమం తెచ్చిన చైతన్యమేనని చంద్రబాబు అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు నక్సలిజంపై తమవిస్పష్ట వైఖరిని ప్రకటించేందుకు ఇదే తగిన సమయమని ఆయనపేర్కొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X