• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సిట్టింగ్‌ జడ్జితో విచారణకు డిమాండ్‌

By Staff
|

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా చేవేళ్ళలో రైతులపై పోలీసులు తూటాలతో చేసిన దాడిపై హైకోర్ట్‌ సిట్టింగ్‌ న్యాయమూర్తితోవిచారణ జరిపించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. రైతులపై పోలీసులచే కాల్పుల జరిపించడం సిగ్గు చేటనివిమర్శించింది.

కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి, ఎం.సత్యనారయణ రావు, చేవళ్ళ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తదితరులు గురువారం చేవేళ్ళను సందర్శించారు. ఘటనలో గాయపడ్డ రైతులను పరామర్శించారు. శుక్రవారం చేవేళ్ళ సంఘటనకు నిరసనగా రంగారెడ్డి జిల్లా బంద్‌ నకు పిలుపునిచ్చింది.

రైతులపట్ల తెలుగుదేశం ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని వారువిమర్శించారు. మహానాడులో నాగలి పట్టుకొని షో చూపించిన చంద్రబాబు ఇప్పుడు అన్నదాతలకు విత్తనాలు బదులు లాఠీదెబ్బలు, బుల్లెట్లు చవిచూపిస్తున్నారని సీఎల్పీ నేత వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి దొప్పిపొడిచారు.

రైతులపై పెట్టిన కేసులన్నింటిని మాఫీ చేయాలనిపీసీసీ అధ్యక్షుడు ఎం.సత్యనారయణరావుకోరారు. ఈ సంఘటనకు బాధ్యులైన పోలీసులను సస్పెండ్‌ చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X