• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దత్తాత్రేయ మంత్రి పదవి పదిలం

By Staff
|

చెన్నై: రైల్వే శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయకు పదవీగండం తప్పింది. మంత్రి పదవి నుంచి తప్పించి ఆయనను రాష్ట్ర భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్రాధ్యక్షుడిగా నియమిస్తారనే ప్రచారం ముమ్మరంగా జరిగింది. ఈ ప్రచారానికి బిజెపి ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల ఇన్‌చార్జి గణేశన్‌ శుక్రవారం తెర దించారు.

దత్తాత్రేయను మంత్రి పదవిలోనే కొనసాగించాలని బిజెపి శాసనసభ్యుడు డాక్టర్‌కె. లక్ష్మణ్‌ నేతృత్వంలోని శాసనసభ్యులు చేసినవిజ్ఞప్తికి గణేశన్‌ శుక్రవారం సానుకూలంగా ప్రతిస్పందించారు. లక్ష్మణ్‌ నేతృత్వంలోని ప్రతినిధులవిజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంటామని గణేశన్‌ చెప్పారు. తమది ప్రజాస్వామ్య పద్ధతిలో నడిచే పార్టీ అని, శాసనభ్యులు చేసిన సూచనను సానుకూలంగా పరిశీలిస్తుందని ఆయన చెప్పారు. పార్టీ రాష్ట్రాధ్యక్షుడి ఎంపిక కోసం పార్టీ నాయకులతో చర్చించనున్నట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X