వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గోద్రా ఊచకోత: కీలక వ్యక్తి అరెస్టు
అహ్మదాబాద్: గోద్రా ఊచకోత కేసులో కీలకమైన వ్యక్తిని ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐటి) అరెస్టు చేసింది. నిరుడు ఫిబ్రవరి 27వ తేదీన సాబర్మతి ఎక్స్ప్రెస్ ఎస్-6 బోగీని దగ్ధం చేయడంతో 59 మంది కరసేవకులు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే.
యూసుఫ్ ఖలందర్ అనే వ్యక్తిని ప్రత్యేక దర్యాప్తు బృందం పోలీసులు సోమవారం రాత్రి గోద్రాలోని సిగ్నల్ ఫాలియా ప్రాంతంలోని అతని ఇంటిలో ఉండగాఅరెస్టు చేశారు. ఖలందర్ గత ఏడాదిగా పరారీలో ఉన్నాడు. ఈ కేసులోని మరో నిందితుడు హబీబ్ అలియాస్బాద్షా బిన్ యామిన్ ఇంటరాగేషన్లో ఖలందర్పేరు చెప్పాడు. ఫరౌఖ్ భానా, సలీం పన్వాలా అనే మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!