వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెలుగొండ ఆచరణ సాధ్యమే: సీఎం

By Staff
|
Google Oneindia TeluguNews

సూర్యపేట: వెలుగొండ సాగునీటి ప్రాజెక్ట్‌ పై ముఖ్యమంత్రి మాట మార్చారు. శుక్రవారం జన్మభూమి కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో జరిగిన గ్రామసభలో ఆయన ప్రసంగిస్తూ..వెలుగొండ ప్రాజెక్ట్‌ఆచరణ సాధ్యమేనని ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్‌ సాధ్యం కాదని రెండు నెలల క్రితం ఆయన చేసిన ప్రకటనకు ఇది పూర్తివిరుద్దం.

కరువు పరిస్థితులున్నా తమ ప్రభుత్వం రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటుందనివివరించారు. సూర్యపేట వద్ద జరిగిన జన్మభూమి కార్యక్రమంలోనూ ప్రసంగించినా ముఖ్యమంత్రి రైతులను తామెప్పుడూ మరవలేదన్నారు.

రైతుల సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామనివివరించారు. మరోవైపు, ముఖ్యమంత్రి ప్రకటించినకోటి వరాలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వ్యక్తమవుతోంది. దరఖాస్తులకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడడంతో అధికారులు వాటికి ఏర్పాట్లు ముమ్మురం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X