• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రాజోలిబండ ఘటనపై బాబు సమీక్ష

By Staff
|
హైదరాబాద్‌: రాజోలిబండ సంఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం ఉదయం తన నివాసంలో సమీక్షించారు. ఈ సమావేశంలో సీనియర్‌ మంత్రులు, నీటిపారుదల శాఖ అధికారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

రాజోలిబండ తూముల వద్దకు ఎవరినీ వెళ్లనీయవద్దని ఆయన కర్నూలు, మహబూబ్‌ నగర్‌ జిల్లాల పోలీసులను ఆదేశించారు. తూముల వద్ద తాత్కాలికంగా పనులు ఆపేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజోలిబండకు చెందిన పది తూములను మూసేయాలని గతంలో అడిగిన కాంగ్రెస్‌ నాయకులు ఇప్పుడు మాట మార్చారనే విషయం సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. రాజోలిబండ మళ్లింపు పథకం వద్ద శుక్రవారం కర్నూలు, మహబూబ్‌నగర్‌ జిల్లాల రైతులు ఘర్షణకు దిగడంతో ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X