వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐమాక్స్‌ తాజ్‌ మహల్‌ లో ఐశ్వర్యరాయ్‌!

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబై: తాజ్‌ మహల్‌ పై నిర్మాణం అవుతోన్న చిత్రాల పరంపరకు మరో చిత్రం తోడు అవుతోంది. కాకపోతే, ఇది ఐమాక్స్‌ చిత్రం. ప్రపంచ ప్రఖ్యాతగాంచిన నిర్మాణ సంస్థ వార్నర్‌ బ్రదర్స్‌ తాజ్‌ మహల్‌ పై ఓ అంతర్జాతీయ చిత్రం రూపొందించే ప్రయత్నంలో ఉండగా, భరత్‌ బాలా (వందేమాతరం వంటి ఆల్బమ్స్‌ సృష్టికర్త) ఐమాక్స్‌ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.

అంతర్జాతీయ స్థాయిలో రూపొందించనున్న ఈ చిత్రంలో ముంతాజ్‌ మహల్‌ పాత్రను ఐశ్వర్యరాయ్‌ పోషించనుందని ఆయన చెప్పారు. ఇప్పటికేఏ 60, 70 శాతం చిత్రీకరణ పూర్తి చేశాం. ఇది పూర్తిగా కమర్షియల్‌ చిత్రాలకు భిన్నంగా ఉండే మ్యూజికల్‌ చిత్రమని ఆయన తెలిపారు.

అంతర్జాతీయంగా ఐశ్వర్యారాయ్‌ అందరికీ తెలిసిన హీరోయిన్‌ కాబట్టే ఆమెను ముంతాజ్‌ మహల్‌ పాత్రకు ఎంపికచేసినట్లు ఆయన చెప్పారు. హైదరాబాద్‌ లో త్వరలో ప్రారంభం కానున్న ప్రసాద్‌ ఐమ్యాక్స్‌ థియేటర్‌ తో పాటు ప్రపంచవ్యాప్తంగా 1400 ఐమాక్స్‌ థియేటర్‌ లలో ఈ చిత్రాన్ని వచ్చే జనవరిలో విడుదల చేయనున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X