• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పట్టాలు తప్పిన మరో రైలు, ఒకరి మృతి

By Staff
|
హైదరాబాద్‌: మరోరైలు పట్టాలు తప్పింది. చిత్తూరు జిల్లా మదనపల్లకి 20 కిలో మీటర్ల దూరంలో..కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు ప్రాంతమైన కుర్బాల కోట స్టేషన్‌ కు సమీపంలో ఓ ప్యాసింజర్‌ రైలు పట్టాలు తప్పింది.

ఈ ఘటనలో అసిస్టెంట్‌ డ్రైవర్‌ మృతి చెందగా, మరో 20 మంది గాయపడ్డారు. ఆదివారం తెల్లవారుఝామున 3 గంటల ప్రాంతంలో పాకాల-బళ్ళారి ప్యాసింజర్‌ పట్టాలు తప్పింది. రైలు పట్టాల మీద ఉన్న రెండు రాళ్లబండలను ఇంజన్‌ ఢీకొనడంతో ఇంజన్‌, మరో రెండు బోగీలు పట్టాలు తప్పాయి.

అసిస్టెంట్‌ డ్రైవర్‌ డి.మణి ఇంజన్‌ నుంచి దూకేందుకు ప్రయత్నించి అక్కడికక్కడే మరణించాడు. గాయపడిని వారు మదనపల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X