• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గ్రామం యూనిట్‌గా పంటలభీమా

By Staff
|

వరంగల్‌: గ్రామం యూనిట్‌గా పంటల భీమా పథకాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆయన మంగళవారంనాడు వరంగల్‌ జిల్లా కూనూరు గ్రామసభలో పాల్గొన్నారు. ప్రస్తుతం మండలం యూనిట్‌గా పంటల భీమా పథకాన్ని అమలు చేస్తున్నట్లు, త్వరలోనే గ్రామం యూనిట్‌గా ఈ పథకాన్ని అమలులోకి తేనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని 6 లక్షల 70 వేల మంది రైతులకు 227 కోట్ల రూపాయల పంటల బీమా మొత్తాన్ని త్వరలోనే విడుదల చేస్తామని ఆయన చెప్పారు.

గ్రామసభలో ప్రసగించడానికి ముందు ఆయన రైతులను కలిసి వారితో మాట్లాడారు. వేరుశనగ చేలోకి వెళ్లి పరిశీలించారు. ఒక రైతు సాగు నీటి సమస్యపై ఫిర్యాదు చేయగా బిందుసేద్యాన్ని వినియోగంలోకి తెచ్చుకుంటే ఆ సమస్య ఉండదని ముఖ్యమంత్రి సలహా ఇచ్చారు. కూనూరు గ్రామానికిఇరవైపులా నిర్మించిన వంతెనలను ఆయన ప్రారంభించారు. ఆడపిల్లల్లో ఆత్మస్థయిర్యంపెరిందనడానికి సానియా మీర్జా, కరణం మల్లీశ్వరులు తార్కాణమని ఆయన అన్నారు.పేదిరక నిర్మూలనకు కరవు పరిస్థితులు ఆటంకంగా మారాయని ఆయన అన్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు సహకరించాలని ఆయన ప్రజలనుకోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X