వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మారన్‌ స్థితిపై విరుద్ధ సమాచారం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి మురసోలి మారన్‌ ఆరోగ్య పరిస్థితిపై పరస్పరవిరుద్ధమైన సమాచారం అందుతోంది. మారన్‌ మృతి చెందారనే వార్తలు ఇక్కడ గుప్పుమంటున్నాయి. అయితే ఈ వార్తల ధృవీకరణ జరగడం లేదు. మారన్‌ ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదని, అయితే స్థిరంగా ఉన్నదని న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్‌అంటున్నారు. మారన్‌ అమెరికాలోని మెథడిస్టు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆయన వాణిజ్య శాఖ మంత్రిగా పని చేశారు. చనిపోయేనాటికి ఆయనకు ఏ విధమైన శాఖ లేదు. గుండె, మూత్రపిండాల వ్యాధులకు, మరిన్ని కీలక వ్యాధులకు చికిత్స నిమిత్తం మారన్‌ను నవంబర్‌ 14వ తేదీన అమెరికాలోని మెథడిస్టు ఆస్పత్రిలో చేర్చారు. ఆయన చాలా నెలలుగా కోమాలో ఉన్నారు.

తమిళనాడులోని తిరుక్కువలైలో 1934 ఆగస్టు 17వ తేదీన జన్మించిన మారన్‌ 1967లో మొదటిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1971లో ఆయన తిరిగి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అనంతరం ఆయన 1977 నుంచి 1995 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ఆయన 1999అక్టోబర్‌ 13వ తేదీన కేంద్ర మంత్రి పదవిని చేపట్టారు.
మారన్‌కు నిరుడు సెప్టెంబర్‌ 25వ తేదీన హైరిస్క్‌ ఎమర్జెన్సీ సర్జరీ జరిగింది. చెన్నైలోనిఅపోలో ఆస్పత్రి ఛీఫ్‌ కార్డియో థొరాసిక్‌ సర్జన్‌ డాక్టర్‌ఎం.ఆర్‌. గిరినాథ్‌ నేతృత్వంలో ఈ చికిత్స జరిగింది. అంతకు ముందు న్యూఢిల్లీలోని అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థలో ఆయనకు చికిత్స జరిగింది.సెప్టెంబర్‌ 29వ తేదీన ఆయన పరిస్థితి విషమించింది.

జర్నలిస్టు, రచయిత, స్క్రీన్‌ప్లే రచయిత అయిత మారన్‌ కొన్ని పుస్తకాలు కూడారాశారు. స్టేట్‌ అటానమీ- మనీలా సుయాచి అనే పుస్తకం ప్రసిద్ధమైంది. ఇది కేంద్ర, రాష్ట్ర సంబంధాలపైపరిశోధనా గ్రంథం. ద్రావిడ ఉద్యమంపై రాసిన ద్రావిడఅయిక్కా వరలారు అనే పుస్తకం కూడా ప్రసిద్ధికెక్కిందే. ఆయన 20కిపైగా తమిళ సినిమాలకు స్క్రీన్‌ప్లే, సంభాషణలురాశారు. ఐదు చిత్రాలను నిర్మించారు. రెండు చిత్రాలకు దర్శకత్వం వహించారు. మూడు లఘుచిత్రాలకు ఆయన రాష్ట్రపతి సర్టిఫికెట్‌అందుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X