• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎమ్మెల్యే రావుల ఆమరణ నిరశన

By Staff
|

మహబూబ్‌నగర్‌: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) శాసనసభ్యుడు రావుల రవీంద్రనాథ్‌ రెడ్డి మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టరేట్‌ ముందు ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. రాజోలిబండ మళ్లింపు పథకం నుంచి తమ జిల్లాకు రావాల్సిన నీటి వాటాను ఇప్పించాలని డిమాండ్‌ చేస్తూ ఆయన నిరశన దీక్షకు దిగారు.

తొలుత టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు మహబూబ్‌నగర్‌లో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం రావుల రవీంద్రనాథ్‌ రెడ్డి మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు ఆమరణ నిరశన దీక్షకు కూర్చున్నారు. తెలుగుదేశం ద్వంద్వ వైఖరి వల్లనే ఆర్‌డిఎస్‌ నీటివిషయంలో మహబూబ్‌నగర్‌ జిల్లాకు అన్యాయం జరుగుతోందని ఆయనవిమర్శించారు. రాజోలిబండ నీటిపై కర్నూలు, మహబూబ్‌నగర్‌ జిల్లా రైతులకు మధ్య ఘర్షణ చెలరేగినవిషయం తెలిసిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X