• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వివాదానికి ప్రధాని దూరంగా ఉండాలి

By Staff
|

షాజాపూర్‌ (ఎంపి)/ న్యూఢిల్లీ: అయోధ్య రామాలయవివాదానికి దూరంగా ఉండాలని రామజన్మ భూమి నిర్మాణ్‌ సమితి కన్వీనర్‌ ప్రేమానందజీ మహారాజ్‌ ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయిని డిమాండ్‌ చేశారు. రామాలయ నిర్మాణానికి రాజకీయ నాయకులు ఆటంకాలు కల్పిస్తున్నారని ఆయన శనివారంవిలేకరుల సమావేశంలో విమర్శించారు.

అయోధ్య వివాదాన్ని సాధ్యమైనంత త్వరలో పరిష్కరించకపోతే ప్రజలే ఆలయ నిర్మాణానికి పూనుకుంటారని ఆయన హెచ్చరించారు. ప్రధాని వాజ్‌పేయి ప్రకటనపై, ఆలయ నిర్మాణంపై రాయ్‌పూర్‌లో బిజెపి కార్యవర్గ సమావేశం తీర్మానంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి చట్టం తేవాలన్న సంఘ్‌ పరివార్‌ డిమాండ్‌నుబలపరుస్తూ బిజెపి తీర్మానం చేయడంపై రాష్ట్రీయస్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) హర్షం వ్యక్తం చేసింది. ఇక బిల్లుకు ఆమోదం లభించేలా చూడాల్సిన బాధ్యత ఇతర రాజకీయ పార్టీలపై ఉన్నదని ఆర్‌ఎస్‌ఎస్‌ అధికార ప్రతినిధి రామ్‌ మాధవ్‌ శనివారంవిలేకరులతో అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X