వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉమ్మడి పౌరస్మృతి వైపు సుప్రీం మొగ్గు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ సమగ్రత, ఐక్యత కోసం ఉమ్మడి పౌరస్మృతినిఅమలు పర్చడమే మంచిదని దేశ అత్యున్నతన్యాయస్థానం అభిప్రాయపడింది. వివాదస్పద ఉమ్మడి పౌరస్మృతిఅమలువైపు సుప్రీంకోర్టు మొగ్గుచూపింది. భారతీయ వారసత్వచట్టంలోని 118 వ సెక్షన్‌ ను రాజ్యాంగ విరుద్దమనిప్రకటిస్తూ...ఉమ్మడి పౌరస్మృతి అమలు చేయాలనిబుధవారం అభిప్రాయడింది.

ఈ అధికరణం ఇంకా అమలులోకి రాకపోవడంపై ప్రధానన్యాయమూర్తి వి.ఎన్‌.ఖారేలతో కూడిన త్రిసభ్య బెంచ్‌విచారం వ్యక్తం చేసింది. భారతీయ వారసత్వచట్టంలోని 118వ సెక్షన్‌ రాజ్యాంగబద్దతను ప్రశ్నిస్తూజాన్‌ వాల్యిత్తమ్‌ ఓ పిటీషన్‌ దాఖలు చేశాడు. ఈపిటీషన్‌ విచారణ సందర్భంగా సుప్రీం ఉమ్మడి పౌరస్మృతిపై తనఅభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. బీజేపీ ఉమ్మడి పౌరస్మృతిఅమలు గురించి ఎప్పట్నుంచో మాట్లాడుతోంది. కానీఇది దేశ లౌకికత్వానికి విరుద్దమని విపక్షాలు వాదిస్తూవస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X