బ్రేకులు వేయకనే గోల్కొండ ప్రమాదం
హైదరాబాద్: బ్రేక్‌లు వేయడంలో ఆలస్యం జరిగినందువల్లనే గోల్కొండఎక్స్‌ప్రెస్ ప్రమాదం సంభవించిందని రైల్వే భద్రతా కమీషనర్‌ఆర్.పి. అగర్వాల్ తేల్చారు. ఈ నెలారంభంలో సికింద్రాబాద్‌కు చెందిన గోల్కొండఎక్స్‌ప్రెస్ వరంగల్ సమీపంలో పట్టాలు తప్పి వంతైనపై నుంచి బోగీలు కింద రోడ్డు పడడంతో 21 మంది మరణించినవిషయ తెలిసిందే. ఈ ప్రమాదంలో మరో 24 మంది గాయపడ్డారు కూడా.
బ్రేక్‌లు వేయడంలో జాప్యం వల్లనే గోల్కొండఎక్స్‌ప్రెస్ ఈ నెల 2వ తేదీన పట్టాలు తప్పినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఈ ప్రమాదంపైవిచారణ చేపట్టిన అగర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. తన దర్యాప్తులో తేలినవిషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదించినట్లు ఆయన తెలిపారు. గోల్కొండఎక్స్‌ప్రెస్ ఇంజన్‌తో పాటు రెండు బోగీలు పట్టాలు తప్పి వంతెనపై నుంచి కింద రోడ్డుమీద పడ్డాయి.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!