వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అజయ్‌, దేవదాసుకు జాతీయ అవార్డులు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగన్‌, బెంగాలీ నటి కొంకణాసేన్‌ ఈ ఏడాది ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు. ప్రతిష్టాత్మక 50వ జాతీయ అవార్డులను శనివారం ప్రకటించారు. ది లెజెండ్‌ ఆఫ్‌ భగత్‌ సింగ్‌ చిత్రంలో నటనకుగా గాను అజయ్‌ దేవగన్‌ ఉత్తమ నటుడుగా ఎంపిక కాగా, మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ అయ్యర్‌ చిత్రంలోని ఉత్తమ నటనకు కొంకణాసేన్‌ ఉత్తమ నటిగా ఎంపికైంది.

ఇదే చిత్రానికి ఉత్తమ దర్శకత్వం అవార్డూ వరించింది. అపర్ణాసేన్‌ కు ఉత్తమ దర్శకురాలి అవార్డు దక్కగా, నర్గీస్‌ జాతీయ సమైక్యతా చిత్రం అవార్డు కూడా ఈ చిత్రానికి దక్కింది.

హిందీ చిత్రం దేవదాసు అధికంగా అవార్డులు దక్కించుకొంది. బుద్దాదేవ్‌ దాసుగుప్తా రూపొందించిన బెంగాళీ చిత్రం మోండో మెయర్‌ ఉపాక్యాన్‌ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. సంజయ్‌ లీలా బన్సాలీ రూపొందించిన దేవదాసు చిత్రానికి ఉత్తమ వినోదాత్మక చిత్రం అవార్డు వరించింది. జ్యూరీ అధ్యక్షుడు ప్రకాష్‌ ఝా అవార్డు వివరాలను ప్రకటించారు. సమాచార, ప్రసార శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ కు అవార్డు వివరాలను, నివేదికను అందచేశారు.

గత ఏడాది కంపెనీ చిత్రంలో నటనకు గాను ఉత్తమ సహాయ నటుడు అవార్డు పొందిన అజయ్‌ దేవగన్‌ ఈ సారి ఉత్తమ నటుడు అవార్డు దక్కించుకోవడం విశేషం. మణిరత్నం రూపొందించిన కణ్ణాత్తిల్‌ ముదమిట్టాల్‌ (తెలుగులో అమృత)కు అవార్డులు లభించాయి.

పూర్తి వివరాలు
ఉత్తమ చిత్రం: మోండో మెయర్‌ ఉపాక్యాన్‌ (బెంగాలీ)
ఉత్తమ వినోదాత్మక చిత్రం: దేవదాసు
ఉత్తమ జాతీయ ప్రభోదాత్మక చిత్రం: మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ అయ్యర్‌
ఉత్తమ దర్శకుడు: అపర్ణాసేన్‌ (మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ అయ్యర్‌)
ఉత్తమ నటుడు: అజయ్‌ దేవగన్‌ ( ది లెజెండ్‌ ఆఫ్‌ భగత్‌ సింగ్‌)
ఉత్తమ నటి: కొంకణా సేన్‌ (మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ అయ్యర్‌)
ఉత్తమ తొలి చిత్రం దర్శకుడు: అభిజిత్‌ చౌదరి (పాతాళ్‌ ఘర్‌), సుబద్రో చౌదరి
(ప్రోహర్‌)
ఉత్తమ గాయని: శ్రేయా ఘోషాల్‌ (దేవదాసు, డోలా..రా.. పాట)
ఉత్తమ నృత్యదర్శకత్వం: సరోజ్‌ ఖాన్‌ (దేవదాసు)
ఉత్తమ కళాదర్శకత్వం: నితిన్‌ దేశాయ్‌ (దేవదాసు)
ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌: నీటా లుల్లా, సందీప్‌ కోస్లా, అబు జైన్‌ (దేవదాసు)

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X