వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అజయ్, దేవదాసుకు జాతీయ అవార్డులు
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, బెంగాలీ నటి కొంకణాసేన్ ఈ ఏడాది ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు. ప్రతిష్టాత్మక 50వ జాతీయ అవార్డులను శనివారం ప్రకటించారు. ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ చిత్రంలో నటనకుగా గాను అజయ్ దేవగన్ ఉత్తమ నటుడుగా ఎంపిక కాగా, మిస్టర్ అండ్ మిసెస్ అయ్యర్ చిత్రంలోని ఉత్తమ నటనకు కొంకణాసేన్ ఉత్తమ నటిగా ఎంపికైంది.
బుద్దాదేవ్ దాసుగుప్తా రూపొందించిన బెంగాళీ చిత్రం మోండో మెయర్ ఉపాక్యాన్ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. సంజయ్ లీలా బన్సాలీ రూపొందించిన దేవదాసు చిత్రానికి ఉత్తమ వినోదాత్మక చిత్రం అవార్డు వరించింది. జ్యూరీ అధ్యక్షుడు ప్రకాష్ ఝా అవార్డు వివరాలను ప్రకటించారు. సమాచార, ప్రసార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు అవార్డు వివరాలను, నివేదికను అందచేశారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!