• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అభివృద్ధిపై విపక్షాల ప్రచారం అబద్దం

By Staff
|
హైదరాబాద్‌: తమ ఆందోళనల వల్లే ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కాంగ్రెస్‌, ఇతర విపక్షాలు అబద్దాలను ప్రచారం చేస్తున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. వాటిని తిప్పికొట్టాలని తమ పార్టీ నేతలకు ఆయన పిలుపునిచ్చారు. బడుగు వర్గాల సంక్షేమాన్ని తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ మరవదని పార్టీ విస్తృత స్థాయి సమవేశంలో ఆయన పేర్కొన్నారు.

ఇటీవల పలు సంక్షేమ కార్యక్రమాల ప్రకటనకు తమ ఆందోలన కారణమని కాంగ్రెస్‌ ప్రకటించుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్దికి కట్టుబడి ఉందని చెపుతూ..అన్యాపదేశంగా తెలంగాణ రాష్ట్ర సమితిపై ఆయన విరుచుకుపడ్డారు.

ఎగువ రాష్ట్రం చేపట్టిన అక్రమ ప్రాజెక్ట్‌ లపై తాము న్యాయ పోరాటం చేస్తుంటే, విపక్షాలు దాన్ని రాజకీయ లబ్ధి కోసం, తమ ప్రభుత్వం రైతులకు సాగునీరు అందివ్వడం లేదని ప్రచారం చేస్తున్నాయని ఆయన విమర్శలు చేశారు. దీన్ని పార్టీ నేతలందరూ సమర్ధంగా తిప్పికొట్టాలన్నారు. గోదావరి జలాల మళ్లింపు, ఇతర ప్రాజెక్ట్‌ లు భారీగా ఖర్చు అయ్యే ప్రాజెక్ట్‌ లు అయినప్పిటికీ, వాటి నిర్మాణానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X