వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓరాకిల్‌ పై భారతీయ యువతి కేసు

By Staff
|
Google Oneindia TeluguNews

ఓక్లాండ్‌: మరో సాప్ట్‌ వేర్‌కంపెనీపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది.ప్రసిద్ది గాంచిన ఓరాకిల్‌ సాప్ట్‌ వేర్‌ సంస్థకుచెందిన ఓ మాజీ ఉన్నతోద్యోగి తనను లైంగికంగావేధించాడంటూ ఓ భారతీయ యువతిఫిర్యాదు చేసింది. లైంగికంగా వేధింపులకు గురవుతోన్న తననుకాపాడేందుకు కంపెనీ ఎటువంటి సాయం, ప్రయత్నంచేయలేదని పేర్కొంటూ ఆ కంపెనీపై ఆమె దావావేశారు.

జూలై 18న కాలిఫోర్నియాసూపిరీయర్‌ కోర్ట్‌ లో దావా వేశారు. అయితే, అందులో ఆమెపేరును వెల్లడించలేదు. బార్బారా డో అనే మారుపేరునుపేర్కొన్నారు. మహేష్‌ ఆనంద్‌ అనే మాజీ ఉద్యోగి తననులైంగికంగా వేధించడంతో పాటు, దాడి చేసినట్లు ఆమెపేర్కొన్నారు. ఒరాకిల్‌ సంస్థ మహిళల పట్ల పక్షపాతవైఖరిని అవలంభిస్తోందని ఆమె ఆరోపించారు. సాంకేతికవిషయాల్లో ప్రతిభ కలిగిన పురుష ఉన్నతోద్యోగులు సాటిమహిళ ఉద్యోగులను వేధించినా కంపెనీచూసి చూడనట్లు ఊరుకుంటోందన్నారు. ఎందుకంటే, సాంకేతిక ప్రతిభ కలిగిన ఆ పురుష ఉద్యోగులను సంస్థ కోల్పోవడానికి ఇష్టపడకపోవడమే ఇందుకు కారణమని 33 ఏళ్ళ ఈ యువతి వివరించారు. అయితే, ఆమె ఆరోపణలను ఓరాకిల్‌ సంస్థ ఖండించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X