• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

న్యూఢిల్లీకి వెళ్ళిన సీఎం బృందం

By Staff
|
హైదరాబాద్‌: రాష్ట్ర ప్రణాళిక వ్యయం ఆమోదం కోసం ప్రణాళిక సంఘంతో చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సాయంత్రం న్యూఢిల్లీ బయలుదేరి వెళ్ళారు.

ఆయన వెంట రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో కూడిన బృందం బయలుదేరింది. 10వేలకు పైగా వ్యయాన్ని ప్రతిపాదిస్తూ..ప్రణాళిక సంఘం ముందు ఉంచనుంది. ఇంతకుముందే శాసనసభా దీనికి ఆమోదం తెలిపింది.

సంఘం అధికారులతో, రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులతో ఇప్పటికే రెండు సార్లు చర్చలు జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ప్రధాని వాజ్‌ పేయి, కేంద్ర జలవనరుల శాఖ మంత్రితోనూ చర్చలు జరిపే అవకాశం ఉంది. కర్ణాటక అక్రమంగా చేపడుతోన్న ప్రాజెక్ట్‌ లపై ముఖ్యమంత్రి ప్రధానికి స్వయంగా వివరిస్తారని తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X