• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మాయావతి వెనకడుగు, ముగిసిన వివాదం

By Staff
|

న్యూఢిల్లీ: వివాదస్పద తాజ్‌ కారిడర్‌ ప్రాజెక్ట్‌ పై అభ్యంతరకర వ్యాఖ్యాలు చేసిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జగ్‌ మోహన్‌ ను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేసిన ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి మాయావతి సింగ్‌ వెనకడుగు వేశారు. మంగళవారం సాయంత్రం ఆ డిమాండ్‌ ను ఉపసంహరించకుంటున్నట్లు ప్రకటించారు. ప్రధాని ఆమె డిమాండ్‌ ను తిరస్కరించిన కొద్దిసేపటికే ఈ ప్రకటన చేశారు. ఉత్తరప్రదేశ్‌ లో మాయావతి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటామని బీజీపీ సభ్యులు బెదరించడం వల్లే మాయావతి వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది.

అంతకుముందు బీఎస్పీ సభ్యులు లోక్‌ సభలో వాయిదాతీర్మానానికై పట్టుబట్టారు. తాజ్‌ ప్రాజెక్ట్‌ పై జగ్‌ మోహన్‌ తప్పుదోవ పట్టించే ప్రకటన చేశారంటూ ఆరోపిస్తూ..దీనిపై వాయిదా తీర్మానానికై పట్టుబట్టాయి.స్పీకర్‌ కు అందుకు నిరాకరించడంతో గలాభా సృష్టించారు.అరుపులు, కేకలతో సభ కాసేపు గందరగోళంగా మారింది.స్పీకర్‌ మనోహర్‌ జోషి అందుకు నిరాకరించడంతో బీఎస్పీ సభ్యులు మంత్రిని బర్తరఫ్‌ చేయాలంటూ డిమాండ్‌ చేశారు.

తాజ్‌ ప్రాజెక్ట్‌ కారిడర్‌ నిర్మాణపు పనులను కేంద్రం ఆపు చేయించిందన్న మంత్రి ప్రకటన తప్పుదోవ పట్టించేదిగా ఉందని, నిజానికి ఆ పనులను ఆపు చేయించింది మాయవతి ప్రభుత్వమని బీఎస్పీ సభ్యులువివరించారు. సభ్యుల గందరగోళం వద్ద సభఅరగంట సేపు వాయిదా పడింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X