• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆంధ్ర శాంతకు మెగసెసే అవార్డు

By Staff
|

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శాంతా సిన్హాకు 2003 సంవత్సరానికిగాను రామన్‌ మెగసెసే అవార్డు లభించింది. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఆమె కృషి చేస్తోంది. ఆమెతో పాటు భారత ప్రధాన ఎన్నికల కమీషనర్‌ మైఖెల్‌ లింగ్డోకు కూడా మెగసెసే అవార్డు లభించింది. దేశంలో స్వేచ్ఛగా, నిజాయితీగా ఎన్నికలు జరిగేందుకు వేసిన పునాదికి గుర్తింపుగా ఆయనకు ఈ అవార్డు లభించింది.

ఈ అవార్డులను పిలిప్పైన్స్‌లోని మనీలాలో బుధవారం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో బాల కార్మికులవిముక్తి కోసం కృషి చేస్తూ వారు బడికి వెళ్లేలా చైతన్యం తీసుకువస్తున్నందుకు గుర్తింపుగా శాంతా సిన్హాకు ఆ అవార్డు లభించింది. ఆసియాలో అత్యున్నతమైన ఈ మెగసెసే అవార్డుకు భారత్‌, చైనా, జపాన్‌, పిలిప్పైన్స్‌, ఈస్ట్‌ టిమోర్‌ల నుంచి ఏడుగురిని ఎంపిక చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X