• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ముంబాయిలో పేలుడు: ఏడుగురు మృతి

By Staff
|

ముంబాయి: ముంబాయి శివారులోని జోగేశ్వరినగర్‌ ప్రాంతంలో గల యాదవనగర్‌లో గురువారం తెల్లవారుజామున పేలుడు సంభవించి ఏడుగురు మరణించారు. 26 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పది మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గాయపడినవారిని కూపర్‌ ఆస్పత్రిలో చేర్చారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

చలచిత్రాల షూటింగ్‌లకు పేలుడు పదార్థాలు సరఫరా చేసే దిల్నావాజ్‌ఖాన్‌ ఇంటిలో ఈ పేలుడు సంభవించింది. అతని కంపెనీవిశాల్‌ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ వివేక్‌ ఒబెరాయ్‌ నటించిన దమ్‌ చిత్రంతో పాటు పలు చిత్రాల నిర్మాణానికి పేలుడు పదార్థాలు సరఫరా చేసింది.

ఈ పేలుడు గురువారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో సంభవించింది. ఈ దుర్ఘటనలోఖాన్‌తో పాటు ఆయన భార్య అంజుమ్‌, వారి కూతురు, ఒక బంధువు, ఇద్దరు పిల్లలు మరణించారు. సంఘటనా స్థలంలో దిల్నావాజ్‌ఖాన్‌ బావ అయూబ్‌ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు జాయింట్‌ పోలీస్‌ కమీషనర్‌(క్రైం) సత్యపాల్‌ సింగ్‌ చెప్పారు. మూడు సిలిండర్లను, ఎలక్ట్రిక్‌ వైర్లను ఇంటిలో నుంచిస్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. పేలుడు పదార్థాలు నిల్వ చేసుకునే అనుమతిఖాన్‌కు ఉన్నదా లేదా అనే విషయం ఇంకా తేలలేదని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X