వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

త్వరలో ద్వంద్వ పౌరసత్వం: అద్వానీ

By Staff
|
Google Oneindia TeluguNews

పూణ: ఈ ఏడాది చివర్లోగా ద్వంద్వ పౌరసత్వ చట్టం అమల్లోకి తెస్తామని ఉపప్రధాని ఎల్‌.కె.అద్వానీ తెలిపారు. ఎంపిక చేసిన కొన్ని దేశాల్లో నివసిస్తోన్న భారతీయులకు ఈ ద్వంద్వ పౌరసత్వం కల్పిస్తామని ఈ ఏడాది ప్రథమార్థంలో ప్రవాసభారతీయుల సదస్సు సందర్భంగా ప్రభుత్వం హామీ ఇచ్చింది. పూణకు చెందిన ఓవిద్యాసంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆదివారం అద్వానీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఓవిద్యార్ధి అడిగిన ప్రశ్నకు అద్వానీ సమాధానమిస్తూ..డిసెంబర్‌ లోగా చట్టం తీసుకొస్తామన్నారు. ఈ ఏడాది మేలో ఇందుకు సంబంధించి బిల్లును పార్లమెంట్‌ లో ప్రవేశపెట్టారు.

విదేశాల్లో నివసిస్తోన్న భారతీయులు ఆ దేశపు పౌరసత్వన్ని కలిగి ఉంటూనే భారతదేశపు పౌరసత్వాన్ని కూడా కలిగి ఉంటారని తెలిపారు. గతంతో పోల్చితే ఇప్పుడు మేథోవలస తగ్గిందని అద్వానీవివరించారు. మనదేశంలోనే ఇప్పుడు మంచి అవకాశాలున్నాయని తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X