వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కృష్ణా డెల్టా నేతల సత్యాగ్రహం

By Staff
|
Google Oneindia TeluguNews

విజయవాడ: కృష్ణాడెల్టా భూములకు నీరందించాలని డిమాండ్‌ చేస్తూ అఖిల పక్ష నేతలు ఉద్యమానికిశ్రీకారం చుట్టారు. వరిపంటకు సాగు నీరివ్వలేమని ప్రభుత్వం ప్రకటించడంతో కృష్ణాడెల్టా రైతులు ఆగ్రహంతో ఉన్నారు. దీంతో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన అన్ని పార్టీల నాయకులువిజయవాడలో సమావేశమై ఈ విషయమై చర్చించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం, కాంగ్రెస్‌లతో సహామిగతా పార్టీల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ఈ నెల 9వ తేదీ నుంచి ప్రకాశం బరాజ్‌ వద్ద నిరవధిక సత్యాగ్రహానికి పూనుకోవాలని సమావేశం నిర్ణయించింది. ఈ సమస్యపై ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని శాసనసభ్యుడు ఎర్నేని రాజారాం ప్రకటించారు. ఈ సమస్యపై కలిసికట్టుగా ముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి విన్నవిద్దామని తెలుగుదేశం నాయకుడు యలమంచిలి శివాజీ సమావేశంలో ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనకు మిగత నాయకులు అంగీకరించలేదు. ప్రకాశం బరాజ్‌ వద్ద నిరవధిక సత్యాగ్రహానికి పూనుకుంటున్నామని, తమ ఆందోళన శాంతియుత పద్ధతుల్లోనే ఉంటుందని, అయితే ఆందోళన ప్రారంభమైన తర్వాత ఈ రూపం తీసుకుంటుందో చెప్పలేమని కొందరు నాయకులు అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X