వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Pushkaralu Gallery

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌: శ్రీనగర్‌ సమీపంలో ఒక హెలికాప్టర్‌ కూలి మంగళవారం ఉదయం ఆరుగురు మరణించారు. మరణించినవారిలో ఒక మహిళ, హెలికాప్టర్‌పైలట్‌ కూడా ఉన్నారు.గందెర్బాల్‌ పవర్‌ స్టేషన్‌ వద్ద ఈ దుర్ఘటన సంభవించింది.

సిక్స్‌ సీటర్‌ బిఇఎల్‌ 407 హెలికాప్టర్‌ నెహ్రూ హెలిపాడ్‌ నుంచి అమర్నాథ్‌కు బయలుదేరింది. ఆ తర్వాత శ్రీనగర్‌కు 23 కిలోమీటర్ల దూరంలో కూలిపోయింది. అందులోని ఐదుగురు అక్కడికక్కడే మరణించగా ఒకరు సౌరా మెడికల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అసువులు బాశారు. ఈ హెలికాప్టర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందినది. మృతులను వినీత్‌ కసాడియా, ఓమ్‌ నారాయణ్‌, శ్రీమతి సంగీతా నారయణ్‌, పైలట్‌ జె.ఎస్‌. కోహ్లోన్‌లుగా గుర్తించారు. శ్రీమతి కసాడియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

ఈ ప్రభుత్వ హెలికాప్టర్‌ యాత్రికులను, విఐపిలను అమర్నాథ్‌కు చేరవేస్తోంది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఛగన్‌ భుజ్‌బల్‌ సోమవారం నాడు అమర్నాథ్‌ యాత్రకు ఇదే హెలికాప్టర్‌లో వెళ్లారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X