• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దత్తాత్రేయ ఇంట్లో ప్రధాని గురుదక్షిణ

By Staff
|

న్యూఢిల్లీ:రైల్వే శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ నివాసంలో ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి గురుదక్షిణ సమర్పించుకున్నారు. ఈవిషయం అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. గురుదక్షిణగా ప్రధానిసీల్డ్‌ కవర్‌లో కొంత మొత్తాన్ని సమర్పించుకున్నట్లు తెలుస్తోంది.

అంతకు ముందు ప్రధాని వాజ్‌పేయి తన మంత్రివర్గ సహచరులు ఎల్‌.కె. అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి కలిసి ధ్వజ ప్రణామం చేశారు. ప్రధాని వాజ్‌పేయి రాష్ట్రీయస్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) స్వయంసేవక్‌గా తన కర్తవ్య నిర్వహణలో భాగంగా వార్షిక సంప్రదాయ కార్యక్రమం గురుదక్షిణలో పాల్గొన్నారు. ఈ ప్రైవేట్‌ కార్యక్రమం న్యూఢిల్లీలోని దత్తాత్రేయ నివాసంలో బుధవారం ఉదయం జరిగినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి మోహన్‌రావు భగవత్‌ గురుదక్షిణ పరంపర అనేఅంశంపై ప్రసంగం చేశారు. పలువురు మంత్రులు, పార్లమెంటు సభ్యులు ఈ కార్యక్రమానికిహాజరయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X