• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

4గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాజీనామా

By Staff
|

హైదరాబాద్‌: నలుగురు తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు తమ శాసనసభ్యత్వాలకు రాజీనామా చేశారు. ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పిసిసి) కొత్త అధ్యక్షుడిగా తెలంగాణకు చెందిన డి.శ్రీనివాస్‌ఎంపికైన నేపథ్యంలో వీరు రాజీనామా చేయడం గమనార్హం.

తెలంగాణపై ఎటూ తేల్చకుండా కాంగ్రెస్‌ అధిష్ఠానం రాష్ట్ర పార్టీ నాయకత్వ మార్పును చేపట్టడాన్ని నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్‌ ఫోరం (సిఎఫ్‌టి) నేతలు జి. చిన్నారెడ్డి, పాల్వాయి గోవర్ధన్‌ రెడ్డి, ఇంద్రకరణ్‌ రెడ్డి, సారయ్యలు తమ శాసనసభ్యత్వాలకు రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను వీరు అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ (ఎఐసిసి) అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపారు.

పిసిసి అధ్యక్షుడిగా డి.శ్రీనివాస్‌ నియామకం జరిగిన వెంటనే శుక్రవారం సిఎఫ్‌టి సమావేశం జరిగింది. తెలంగాణపై అధిష్ఠానం స్పష్టమైన వైఖరి ప్రకటించనందుకు సమావేశం నిరసన వ్యక్తం చేసింది. తెలంగాణకు చెందిన డి.శ్రీనివాస్‌ను పిసిసి అధ్యక్షుడిగా నియమించడంతో అధిష్ఠానం నిర్ణయం తెలంగాణకు అనుకూలంగా వుండబోదనే అభిప్రాయానికి తెలంగాణ కాంగ్రెస్‌ ఫోరం నేతలు వచ్చినట్లు అర్థం చేసుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X