వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మరో ముగ్గురి ఎమ్మెల్యేల రాజీనామా?
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణవివాదం కాంగ్రెస్ లో చిచ్చు పెడుతోంది. ఇప్పటికే అధిష్టానంపై అలకబూని నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా లేఖలు సోమవారంపంపారు.
సోమవారం ఉదయం కాంగ్రెస్ తెలంగాణ ఫోరంకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు సోనియాగాంధీకి రాజీనామా పత్రాలు సమర్పించినట్లు ఫోరంపేర్కొంది. అధిష్టానం వెంటనే స్పందించకపోతే, ఫోరంలోని నలభై మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామా చేస్తారని హెచ్చరించింది. మరోవైపు,సీఎల్పీ నేత వీరిని బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభించారు.
Comments
Story first published: Monday, August 11, 2003, 23:53 [IST]