వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒఎన్‌జిసిలో సహాయ నిరాకరణ

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబాయి: చమురు, సహజవాయువుల సంస్థ(ఒఎన్‌జిసి) ఉద్యోగులు బుధవారం సహాయ నిరాకరణకు దిగారు. ఉద్యోగుల ఆందోళన ప్రభావం పనిపై ఏ మాత్రం పడలేదని యాజమాన్యం ప్రకటించింది.

హెలికాప్టర్‌ కూలిపోయి తమ సహచరులు మృతి చెందిన నేపథ్యంలో ఒఎన్‌జిసి ఉద్యోగులు సహాయ నిరాకరణ చేపట్టారు. తాము విధులకు హాజరవుతున్నామని, అయితే తమ ఆందోళన వల్ల ఉత్పత్తి 25 శాతానికి పడిపోతుందని ఉద్యోగులుఅంటున్నారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలేసిఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, ప్రమాదంపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలని ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఆరేబియా సముద్రంలో హెలికాప్టర్‌ కూలి మరణించిన 22 మంది ఒఎన్‌జిసి ఉద్యోగుల మృతదేహాలను వెలికితీశారు. ఇంకా రెండు మృతదేహాల కోసం అన్వేషణ సాగుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X