• search
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎప్పుడూ అధికారం మాదే: బాబు

By Staff
|

హైదరాబాద్‌: తమ పార్టీ ఉన్నంత వరకు రాష్ట్రంలో ఇదే అధికారంలో ఉంటుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఆయన శనివారం ఒక ప్రైవేట్‌ టీవీ చానల్‌ ద్వారా పార్టీ బూత్‌ కమిటీలను ఉద్దేశించి ప్రసంగించారు.

రాష్ట్రాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా తీర్చి దిద్దుతున్నామని, రాష్ట్రాన్ని ఒక గాడిలోపెట్టామని, అయితే ఇంకా ఎంతో సాధించాల్సి ఉన్నదని ఆయన అన్నారు. మానవీయ దృక్పథంతో అమలు చేస్తున్న సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ఆయన చెప్పారు. సమస్యల పరిష్కారానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముందుకు రావాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని ఆయన చెప్పారు.

జన్మభూమిని రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్‌ ప్రకటనను ఆయన తీవ్రంగావిమర్శించారు. ఆచరణ సాధ్యం కాని ప్రకటనలు చేస్తూ కాంగ్రెస్‌ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆయనవిమర్శించారు. స్థానిక సంస్థలకు కాంగ్రెస్‌ హయాంలో ఎన్నడూ ఎన్నికలు జరగలేదని, తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాతనే వాటికి ఎన్నికలు నిర్వహించామని ఆయన చెప్పారు. నాయకత్వ లక్షణాలనుపెంపొంచుకోవాలని ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎవరూ నాయకులుగా పుట్టరని, కృషి ద్వారా నాయకులుగా ఎదుగుతారని, అయితే వారికి నీతి, నిజాయితీ కూడా అవసరమని ఆయన అన్నారు.

రాష్ట్రం అప్పులు తేవడాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని, అయితే తాము కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రాబడుతున్నామని, ఆర్థిక వనరులనుపెంచుకున్నామని, అప్పులు కూడా తెస్తున్నామని, ఈ నిధులన్నింటితో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని ఆయనవివరించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more