• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అవిశ్వాసం: విపక్షాల వ్యూహం రేపు

By Staff
|

న్యూఢిల్లీ: సోమవారం నాటిఅవిశ్వాస పరీక్షకు ఎన్డీఎ ప్రభుత్వం ఇప్పటికే సిద్దంకాగా, కాంగ్రెస్‌ అధ్వర్యంలోని విపక్షాలు తమ వ్యూహాన్ని సోమవారం నాడే ఖరారు చేయనున్నాయి. పార్లమెంట్‌ లో చర్చ సందర్భంగా రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ చర్చలో పాల్గొనాలని నిర్ణయించడంతో కాంగ్రెస్‌ ఇంకా ఎత్తులు పై ఎత్తులు వేయడంలో తలమునకలై ఉంది.

అయితే, తమకు బలం లేదని కాంగ్రెస్‌అంగీకరించింది. కేవలం ఎన్డీఏ ప్రభుత్వం వైఫల్యాలను, అసమర్ధతను, అవినీతిని, దివాళుకోరుతనాన్ని ఎండగట్టేందుకు ఈఅవిశ్వాస పరీక్ష అని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి ఎస్‌.జైపాల్‌ రెడ్డి ఆదివారంవిలేకరులకు చెప్పారు. కాంగ్రెస్‌ కు ములాయం సింగ్‌ యాదవ్‌, శరద్‌ పవార్‌ లు మద్దతు పలకడం ఊరట.

మరోవైపు, సోమవారం నాడు పార్లమెంట్‌సెంట్రల్‌ హాల్‌ లో ఎన్డీఏ ఎంపీల సమావేశం ఏర్పాటు చేయనున్నామని జార్జి ఫెర్నాండెజ్‌ తెలిపారు. దీనికి ప్రధాని అధ్యక్షత వహిస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X