• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆజాద్‌ సూచనకు ఫోరం సుముఖత

By Staff
|

హైదరాబాద్‌: నవంబర్‌ వరకు ప్రత్యేక రాష్ట్రం, ప్రత్యేక తెలంగాణపీసీసీ ఏర్పాటు వంటి డిమాండ్లను పక్కన పెట్టాలని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ ఛార్జి గులాం నబీ ఆజాద్‌చేసిన వినతికి తెలంగాణ కాంగ్రెస్‌ నేతలుసుముఖత వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఆదివారం నాలుగు గంటల పాటు సమావేశమైన తెలంగాణ లెజిస్లేర్‌ ఫోరం ఈ మేరకు తీర్మానం చేసింది. ఈ లోగా తెలంగాణ జిల్లాల్లో పర్యటించి, ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని ఫోరం కన్వీనర్‌ ఇంద్రకరణ్‌ రెడ్డి చెప్పారు.

అధిష్టానం మాటను గౌరవిస్తున్నామని, అయితే ఈ సూచన తెలంగాణవాదులసెంటిమెంట్లను అగౌరవపర్చినట్లేనని తెలంగాణ కాంగ్రెస్‌ వేదిక నేతలు ఆదివారం అభిప్రాయపడ్డారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం డిమాండ్‌ ఇప్పటిది కాదని, కాబట్టి కాంగ్రెస్‌ కు ఇది ప్రతికూల ప్రభావం చూపే అవకాశమే లేదని వేదిక ఛైర్మన్‌ జి.చిన్నారెడ్డి అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X