వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ వరల్డ్‌ ట్రేడ్‌ టవర్‌లో కాల్పులు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్‌తో పాటు శాంతి బాటలో నడవాలని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి పాకిస్థాన్‌ను ఆహ్వానించారు. తరుచుగా శాంతి ప్రక్రియకు ముందుకు రావడమనేది భారత్‌ బలహీనత కాదని ఆయన స్పష్టం చేశారు. సీమాంతర ఉగ్రవాదానికి పూర్తిగాస్వస్తి చెప్పుతుందా లేదా అనే విషయంపై పాకిస్థాన్‌ నిబద్ధత ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు.

తనస్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఆయన శుక్రవారంనాడు ఆయన భారత, పాకిస్థాన్‌ సంబంధాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. ఇరు దేశాల ప్రజలు ప్రశాంతంగా జీవించానుకుంటున్నారని,అందువల్ల భారత వ్యతిరేక దృక్పథాన్ని పాకిస్థాన్‌ విడనాడడం మంచిదని ఆయన అన్నారు. సమస్యలను శాంతియుత పద్ధతుల్లో పరిష్కరించుకోవాలని భారత్‌ కోరుకుంటోందని, తరుచుగా శాంతి ప్రక్రియకుశ్రీకారం చుడుతుండడం భారత్‌ బలహీనత కాదని, అది భారత్‌ నిబద్ధతకు నిదర్శనమని ఆయన అన్నారు.

ప్రజలకు ఆయన ఈ సందర్భంగా పలు వరాలు ప్రకటించారు. రైతులకు, చేనేత కార్మికులకు, చేతివృత్తులవారికి ఆయన తక్కువ వడ్డీపై రుణాలను ఇస్తున్నట్లు చెప్పారు. రైతుల ఆదాయాన్ని 2010 నాటికి రెండింతలు చేయడానికి హరిత,శ్వేత విప్లవాల పంథాల్లో ఆహార వలయ విప్లవానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

చంద్రమండలంలో భారత శాస్త్రవేత్తలు 2008 నాటికి అడుగుపెట్టగలరని ఆయన చెప్పారు. తమది బహు మతాల దేశమైనందునవిశ్వాసాల ప్రాతిపదికపై కొందరి పట్ల వివక్ష ప్రదర్శించడం, వారికి అన్యాయానికి చేయడం సాధ్యం కాదని ఆయన అన్నారు. ఇటీవలి కాలంలో పాకిస్థాన్‌తో సంబంధాల్లో కొంత సాధారణ స్థితి నెలకొన్నప్పటికీ తీవ్రవాద కార్యకలాపాలు కొనసాగుతూనే ఉన్నాయని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X