వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియాకు వాజ్‌పేయి ప్రశంసలు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్‌: కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీని విదేశీ గడ్డమీద ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి కొనియాడారు. ఇటీవలి భారత పర్యటన సందర్భంగా ఇజ్రాయెల్‌ ప్రధానిషెరాన్‌ కలవాలని నిర్ణయం తీసుకున్నందుకు ఆయన సోనియాను ప్రశంసించారు. కాంగ్రెస్‌ అనుబంధ సంస్థలు కొన్ని, తృతీయ ఫ్రంట్‌షెరాన్‌ను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సోనియాఅందుకు విరుద్ధంగా ప్రతిస్పందించినందుకు ఆయన బుధవారం ఇక్కడ అభినందించారు.

షెరాన్‌ను కలవడం ద్వారా ప్రతిపక్ష నేతగా సోనియా తన బాధ్యతను నిర్వర్తించారని ఆయన అన్నారు.అందుకు తాను ఆమెకు కృతజ్ఞతలు తెలియజేసినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుత ప్రపంచ వాతావరణంలో భారత- అమెరికా సంబంధాలు అనేఅంశంపై ఆసియా సొసైటీ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు.

పార్లమెంటుపై 2001 డిసెంబఱ్‌ 13వ తేదీన ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు ఆమె పలకరించారని,అందుకు కూడా తాను ఆమెను అభినందించానని వాజ్‌పేయి చెప్పారు. తాను ఇంట్లో ఉన్నానని, పార్లమెంటుకు బయలుదేరుతున్నానని చెప్పానని, తాను కూడా ఆమె గురించి అడిగాననని, తాను ఇంటి నుంచే మాట్లాడుతున్నానని ఆమె చెప్పారని, ఇది భారత ప్రజాస్వామ్యం గొప్పతనమని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X