• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మాజీ ఎమ్యెల్యే ఆత్మాహుతి యత్నం

By Staff
|

హైదరాబాద్‌: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా మాజీ శాసనసభ్యుడు ఒకరు ఆత్మాహుతి యత్నానికి ప్రయత్నించారు. శాసనసభ ఆవరణలోనే గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది.

కోడూరి వరదారెడ్డి అనే మాజీ శాసనసభ్యుడు శాసనసభ ఆవరణలోని గాంధీవిగ్రహం వెనక అడకత్తెరతో వేళ్లు కత్తిరించుకున్నారు. దీన్ని గమనించి ఆయన యత్నాన్ని అడ్డుకున్నారు. కాంగ్రెస్‌ సభ్యుడు జి. చిన్నారెడ్డి వరదారెడ్డిని కలుసుకుని వరదారెడ్డితో మాట్లాడారు. వరదారెడ్డినిస్పీకర్‌ ప్రతిభాభారతి వద్దకు తీసికెళ్లారు.

వరంగల్‌, కరీంనగర్‌, నల్లగొండ జిల్లాలోని 2 లక్షల 30 వేల ఎకరాలకు సాగు నీరందించడానికి తలపెట్టినశ్రీరాంసాగర్‌ వరద కాలువను పూర్తి చేయడానికి ప్రభుత్వం నిధులు సరిగా విడుదల చేయడం లేదని వరదారెడ్డివిమర్శిస్తున్నారు. ఇదే నిర్లక్ష్యం కొనసాగితే ఆత్మాహుతి దాడులకు దిగుతామని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X