• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టిడిపికి ఈ భయాలెందుకు?: కెసిఆర్‌

By Staff
|

హైదరాబాద్‌ః నకిలీ స్టాంపుల కుంభకోణంపై తెలుగుదేశం పార్టీ ధోరణి అనుమాస్పదంగా ఉందని టిఆర్‌ ఎస్‌ నాయకుడు కె.చంద్రశేఖరరావు అన్నారు. ఇంటిలిజెన్స్‌ వైఫల్యం వల్లనే ఈ కుంభకోణం రాష్ట్రంలో తీవ్ర రూపం సంతరించుకున్నదని ఆయన అన్నారు.

గురువారం అసెంబ్లీలో కుంభకోణాలు, నేరమయ రాజకీయాలపై ఆయన మాట్లాడుతూ నకిలీ స్టాంపుల కుంభకోణంలో కృష్ణా యాదవ్‌మినహా మరెవ్వరూ లేరని ముఖ్యమంత్రి, హోంమంత్రి, డిజిపి హడావుడిగా ప్రకటించడాన్ని ఆయన ఆక్షేపించారు.

ఈ అంతర్రాష్ట్ర కుంభకోణంపై మహారాష్ట్రస్పెషల్‌ ఇవెస్టిగేషన్‌ టీం దర్యాప్తు కొనసాగుతుడగా రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి ప్రకటనలు చేయడం మంచిది కాదన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో తెలుగుదేశం ప్రభుత్వం భయం భయంగా అనుమానాస్పదంగా వ్యవహరిస్తోందని ఈవిషయాన్ని పత్రికల వారు, ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని ఆయన తెలిపారు.

నేరమయ రాజకీయాల అంశం జోలికి పోకుండా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ మధ్య జరిగిన కుంభకోణాలపైనే ఆయన దృష్టిపెట్టారు. నకిలీ స్టాంపుల కుంభకోణంలో రాష్ట్రానికి చెందిన ఒక పోలీసు ఉన్నతాధికారి ప్రమేయం ఉన్నట్టు గురువారం పత్రికల్లో వచ్చినవిషయాన్ని ఆయన ప్రస్తావించారు.

ఈ కుంభకోణం గుట్టు రట్టు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించాలే కానీ భుజాలు తడుముకున్నట్టు వ్యవహరించరాదని ఆయన అన్నారు. కృషి బ్యాంకు ఎండీని ఇంకా పట్టుకోలేని ప్రభుత్వ అసమర్ధతను ఆయన ఎద్దేవా చేశారు. ఈ బ్యాంకు కుంభకోణంలో పోలీసు ఉన్నతాధికారుల పాత్ర గురించి ప్రజల్లో చర్చ జరుగుతోందని, దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. స్కాలర్‌ షిప్‌ ల కుంభకోణాన్ని, ప్రభుత్వ ఆస్పత్రులలో మందుల కోనుగోలులో అక్రమాలను ఆయన ప్రస్తావించారు.

కేంద్ర విజిలెన్స్‌ మాజీ కమిషనర్‌ విఠల్‌ ను గుడ్‌ గవర్నెన్స్‌ కన్సల్టెంటుగా నియమించినప్రభుత్వం అవినీతి నిరోధానికి ఆయన ఇచ్చిన నివేదికను ఎందుకు బుట్ట దాఖలు చేశారని ఆయన ప్రశ్నించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X