వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాంనగర్‌ కుట్ర కేసు కొట్టివేత

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాంనగర్‌ కుట్ర కేసును హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు సోమవారం కొట్టేసింది. ఈ కేసు 18 యేళ్ల పాటు నడిచింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని సాయుధంగా కూల్చివేయడానికి కుట్ర పన్నారంటూవిప్లవోద్యమ నాయకులు, విప్లవ రచయితలపై ఈ కేసు నమోదయింది.

ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర పన్నారంటూ 1986లో 45 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఇందులో 17 మందిపై చార్జిషీట్‌ దాఖలు చేశారు. ఈ 45 మందిలోవిప్లవోద్యమ నాయకులు కొండపల్లి సీతారామయ్య వంటి నక్సల్స్‌ నాయకులు, వరవరరావు, తదితరవిప్లవ రచయితలు ముద్దాయిలుగా ఉన్నారు. కొండపల్లిసీతారామయ్యపై 1995లో కేసు ఉపసంహరించుకున్నారు. పది మందిపై కేసుపెట్టారు. కేసు విచారణ జరిగిన ఈ సుదీర్ఘ కాలంలో నిందితులు కొందరు మరణించారు. చివరికి వరవరరావు, సుధాకర్‌లు మాత్రమేమిగిలారు. కేసులో 600 మంది సాక్షులను విచారించారు.

తమను వేధించడానికే ఈ కేసు పెట్టారని తీర్పు వెలువడిన అనంతరం వరవరరావువిలేకరులతో అన్నారు. కోర్టు చుట్టూ తిప్పడానికి, తనను, తన కుటుంబ సభ్యులను వేధించడానికి ఈ కేసుపెట్టారని ఆయన అన్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా చట్టబద్దం కానప్పటికీ కుట్ర చేయడం న్యాయసమ్మతం, ధర్మమని పీస్‌ ఇన్షియేటివ్‌ కమిటీ కన్వీనర్‌ సుధాకర్‌ అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X