• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇక ప్రధాని నిర్ణయమే ఉంది: జోషి

By Staff
|

న్యూఢిల్లీ: రాజీనామా చేసిన మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి మురళీ మనోహర్‌ జోషి సోమవారం ప్రధాని వాజ్‌పేయిని కలుసుకున్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తనపై అభియోగాలు నమోదు చేయాలని రాయ్‌బరేలీ కోర్టు తీర్పు ఇవ్వడంతో ఆయన మంత్రిపదవికి రాజీనామా చేశారు.

జోషీ రాజీనామాపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఇక ప్రధానిమీదే ఉన్నది. ఈ విషయమై ప్రధాని ఇతర నాయకులను సంప్రదిస్తారని భావిస్తున్నారు. బాబ్రీ కేసు రాజకీయ ఉద్దేశ్యాలతో కూడినదైనందున జోషీ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ప్రకటించింది.

తన రాజీనామా అంశాన్ని ప్రధాని పరిశీలిస్తున్నారని ప్రధాని వాజ్‌పేయితో గంటసేపు సమావేశమైన జోషీ అనంతరంవిలేకరులతో చెప్పారు. 13 రోజలు టర్కీ, న్యూయార్క్‌ పర్యటనలను ముగించుకుని వాజ్‌పేయి ఆదివారం రాత్రి ఇక్కడికి వచ్చారు. జోషీ సోమవారం ఆయనను కలిశారు. తన రాజీనామాపై ప్రధానితో చర్చించానని, నిర్ణయాన్ని ప్రధానికే వదిలేశానని, ఆయన నిర్ణయం కోసం నిరీక్షిస్తానని జోషి చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X