వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కార్వాన్‌ లో మజ్లిస్‌ ఘనవిజయం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:హైదరాబాద్‌లోని కార్వాన్‌ శాసనసభా నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో మజ్లీస్‌ అభ్యర్థి మహమ్మద్‌ముఖ్తాదాఖాన్‌ ఘనవిజయం సాధించారు. ఆయన భారతీయ జనతా పార్టీ(బిజెపి) బద్దం బాల్‌రెడ్డిపై 20 వేల ఓట్ల మెజారిటీసాధించారు.

మజ్లీస్‌ శాసనసభ్యుడుసయ్యద్‌ సజ్జాద్‌ ఆకస్మిక మృతితో ఈ ఉప ఎన్నికజరిగింది. ముఖ్తాదాఖాన్‌కు 67,376 ఓట్లు రాగాబాల్‌రెడ్డికి 47,660 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ అభ్యర్థిఅమర్‌సింగ్‌ 8,132 ఓట్లతో, తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థికె. కృష్ణారావు 5,177 ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఈ ఎన్నికలనుఅన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బాల్‌ రెడ్డిని గెలిపించడానికి బిజెపి జాతీయ అధ్యక్షుడుఎం. వెంకయ్యనాయుడితో సహా ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు కూడా ప్రచారంచేశారు. బాల్‌రెడ్డికి తెలుగుదేశం పార్టీ మద్దతుప్రకటించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X